నేడు ఈ జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు

0చూసినవారు
నేడు ఈ జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు
AP: ‘అక్వాన్’ తుఫాన్ ప్రభావంతో ఏపీలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విశాఖ వాతావరణ శాఖ హెచ్చరించింది. రేపు నరసాపురం-పూరీ మధ్య తుఫాన్ తీరం దాటే అవకాశముందని తెలిపింది. నేడు శ్రీకాకుళం, విశాఖపట్నం, అనకాపల్లి, విజయనగరం, అల్లూరి, కాకినాడ జిల్లాల్లో అతిభారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో రెడ్ అలర్ట్ జారీ చేసింది. మన్యం, పశ్చిమ గోదావరి, కోనసీమ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్