AP: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఈ నెల 26న (సోమవారం) నాటికి తీవ్ర తుఫాన్‌గా మారనుందని IMD హెచ్చరించింది. తూర్పు మధ్య- ఆగ్నేయ బంగాళాఖాతం వాయుగుండంగా రూపాంతరం చెంది.. ఎల్లుండికి తీవ్రవాయుగుండంగా బలపడనుందని పేర్కొంది. ఇది పశ్చిమ-వాయవ్య దిశగా కదులుతూ ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా తీరాల వైపు పయనించనుందని తెలిపింది. దీని ప్రభావంతో ఈ నెల 27, 28 తేదీల్లో ఏపీలో, అక్టోబర్ 28న ఒడిశాలో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది.