AP: రాయలసీమ ప్రాంత ప్రజలకు వాతావరణ కేంద్రం శుభవార్త అందించింది. ఈ ప్రాంత జిల్లాల్లో ఇవాళ జోరుగా వర్షాలు కురుస్తాయని ఏపీ వెదర్మ్యాన్ వెల్లడించారు. ముఖ్యంగా శుక్రవారం రాత్రి, రేపు తెల్లవారుజామున కర్నూలు, అనంతపురం, శ్రీసత్యసాయి, చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం, అన్నమయ్య, వైఎస్సార్ జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని, ఉరుములు, మెరుపులు సంభవిస్తాయని ఆయన తెలిపారు.