AP: మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం తుఫాన్‌గా బలపడింది. దీంతో రాష్ట్రంలోని పలుచోట్ల వర్షం దంచికొడుతోంది. విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ జిల్లాల్లో ఆదివారం అర్ధరాత్రి నుంచి సోమవారం తెల్లవారుజాము అయినా వర్షం పడుతూనే ఉంది. దీంతో పలు ప్రాంతాలు తడిసిముద్దయ్యాయి. మరోవైపు ఈ తుఫాన్ ప్రభావంతో నేడు కృష్ణా, గుంటూరు, బాపట్ల, మార్కాపురం, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు, ఒకట్రెండు చోట్ల అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఏలూరు, ఉభయ గోదావరి జిల్లాలు, ఎన్టీఆర్, పల్నాడు, తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో అతి భారీ వర్షాలు పడవచ్చని వాతావరణ శాఖ తెలిపింది.