AP: ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడటంతో ఏపీలో వాతావరణం మారింది. దీంతో విజయనగరం, శ్రీకాకుళం, అల్లూరి సీతారామరాజు, మన్యం జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడుతున్నాయి. విశాఖ, అనకాపల్లి, కాకినాడ జిల్లాల్లో వర్షం దంచికొడుతుంది. ఈదురుగాలులతో బీభత్సం సృష్టిస్తోంది. సముద్రం అల్లకల్లోలంగా ఉన్నందున 48 గంటలు మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని APSDMA సూచించింది.