అల్పపీడనం ప్రభావంతో ఏపీలో పలుచోట్ల వర్షాలు దంచికొడుతున్నాయి. ముఖ్యంగా కర్నూలు, నంద్యాల జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఆత్మకూరు మండలంలో రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుండగా.. కోడుమూరు, నంద్యాల, మహానంది, బండిఅత్మకూరు, పాణ్యం ప్రాంతాల్లో వర్షాలు పడుతున్నాయి. నంద్యాలలో భారీ వర్షంతో రహదారులు జలమయమయ్యాయి. ప్యాపిలి, బేతంచర్ల మండలాల్లోనూ వర్షం కురుస్తోంది.