తాడిపత్రిలో భారీ వర్షం.. జలమయమైన రోడ్లు

185చూసినవారు
AP: అనంతపురం జిల్లా తాడిపత్రిలో శనివారం రాత్రి నుంచి తెల్లవారుజాము వరకు కురిసిన భారీ వర్షం పట్టణాన్ని జలమయం చేసింది. ప్రధాన రహదారులు, వీధుల్లో మోకాళ్ల లోతు వరకు నీరు నిలిచిపోవడంతో వాహనదారులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. అయితే, యాడికి, పెద్దవడుగూరు, పెద్దపప్పూరు, ఎల్లనూరు, పుట్లూరు మండలాల్లోనూ వర్షం కురవడంతో తీవ్ర వర్షాభావంతో అల్లాడుతున్న అన్నదాతలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్