భారీ వర్షాలు.. దెబ్బతిన్న రైల్వే ట్రాక్ (వీడియో)

0చూసినవారు
AP: అర్నబ్ తుఫాన్ ప్రభావంతో అల్లూరి జిల్లా అరకులోయ ప్రాంతంలో మంగళవారం రాత్రి భారీ వర్షాలు కురిశాయి. ఈ వర్షాల ధాటికి కేకే లైన్ లో బొర్రా గుహలు - కరకవలస రైల్వే స్టేషన్ల మధ్య ట్రాక్ కింద ఉన్న మట్టి కొట్టుకుపోయింది. దీనివల్ల రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ముందస్తు జాగ్రత్తగా రైల్వే అధికారులు ఇప్పటికే అరకు ప్యాసింజర్ రైలును నిలిపివేశారు. ప్రస్తుతం యుద్ధ ప్రాతిపదికన ట్రాక్ పునరుద్ధరణ పనులను చేపట్టారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్