అతిభారీ వర్షాలు.. బయటకు రావొద్దు!

32చూసినవారు
అతిభారీ వర్షాలు.. బయటకు రావొద్దు!
AP: పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన మురసు తుఫాన్ రాష్ట్రం వైపు దూసుకొస్తోంది. గడిచిన 6 గంటల్లో 10 కి.మీ. వేగంతో ముందుకు కదులుతోంది. తుఫాన్ ప్రభావంతో దక్షిణ కోస్తా, రాయలసీమలో అక్కడక్కడ భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని APSDMA తెలిపింది. తీరం దాటే సమయంలో 100-120 కి.మీ. వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయంది. ప్రస్తుతం నెల్లూరుకు 100 కి.మీ, కావలికి 120 కి.మీ, తిరుపతి 160 కి.మీ, ఒంగోలుకు 160 కి.మీ, బాపట్లకు 180 కి.మీ దూరంలో తుఫాన్ కేంద్రీకృతమైంది. ప్రజలు ఇంట్లోనే సురక్షితంగా ఉండాలని, బయటకు రావొద్దని సూచించింది. ముందస్తు చర్యగా 9 రైళ్లను ద.మ రైల్వే రద్దు చేసింది.

సంబంధిత పోస్ట్