AP: వాయుగుండం ప్రభావంతో కోస్తాంధ్రలో భారీ వర్షాలకు అవకాశం ఉండటంతో విపత్తుల నిర్వహణ శాఖ అప్రమత్తమైంది. ఈ మేరకు హోంమంత్రి అనిత పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. పశ్చిమ మధ్య, ఆనుకుని ఉన్న వాయువ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న వాయుగుండం రానున్న 24 గంటల్లో తీవ్ర వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. రేపు, ఎల్లుండి కోస్తాంధ్రలో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, ఉత్తరాంధ్ర ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హోంమంత్రి సూచించారు. ప్రజలు బయటకు వెళ్లొద్దని, అత్యవసర సహాయం కోసం 112, 1070, 18004250101 నంబర్లను సంప్రదించాలని సూచించారు.