ఏపీలో వాయుగుండం ప్రభావంపై హోంమంత్రి అనిత అధికారులతో సమీక్షించి, ముందస్తు చర్యలను వేగవంతం చేశారు. ఉత్తరాంధ్ర, కోస్తా జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లవద్దని సూచించారు. అత్యవసర సహాయం కోసం 112, 1070, 18004250101 నంబర్లను సంప్రదించాలని, ప్రజలకు ఎప్పటికప్పుడు వర్షాలపై అప్రమత్తం చేయాలని ఆదేశించారు.