ఏపీలో భారీ వర్షాలు.. ఇవాళ కూడా స్కూళ్లకు సెలవు

4చూసినవారు
ఏపీలో భారీ వర్షాలు.. ఇవాళ కూడా స్కూళ్లకు సెలవు
మురసు తుఫాన్ ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీనివల్ల అనకాపల్లి, ఏలూరు, ప్రకాశం, కృష్ణా, కోనసీమ, ఎన్టీఆర్, పల్నాడు, గుంటూరు, బాపట్ల జిల్లాల్లోని విద్యాసంస్థలకు అధికారులు నేడు సెలవు ప్రకటించారు. ఎస్‌డీఎంఏ నివేదిక ప్రకారం.. కృష్ణా, గుంటూరు, బాపట్లలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండగా, కోనసీమ, ఉభయ గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, పల్నాడు, మార్కాపురం, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో మోస్తరు వర్షాలు పడవచ్చని అంచనా వేసింది.

సంబంధిత పోస్ట్