భారీ వర్షాలు.. రెడ్ అలర్ట్: APSDMA

9చూసినవారు
భారీ వర్షాలు.. రెడ్ అలర్ట్: APSDMA
AP: దక్షిణ ఛత్తీస్‌గఢ్, దాని పరిసర ప్రాంతాలపై అల్పపీడనం కేంద్రీకృతమై ఉందని APSDMA తెలిపింది. ఇది రాబోయే 24 గంటల్లో పశ్చిమ-వాయువ్య దిశగా దక్షిణ ఛత్తీస్‌గఢ్,విదర్భ మీదుగా కదిలే అవకాశం ఉందని పేర్కొంది. దీని ప్రభావంతో శని, ఆదివారాల్లో రాష్ట్రంలో  విస్తారంగా వర్షాలు కురుస్తాయంది. ఇవాళ ఉత్తరాంధ్ర జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు, దక్షిణ కోస్తాలో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందంది. ఈ మేరకు ఆయా జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్