AP: రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు దంచికొడుతున్నాయి. తిరుపతిలో భారీ వర్షం కురుస్తోంది. కాసేపట్లో బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి, కడప జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురుస్తాయని APSDMA తెలిపింది. ఈ మేరకు ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. 40-50 కిలో మీటర్ల వేగంతో గాలులు వీస్తాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.