AP: బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం ఏపీ వైపు దూసుకొస్తోంది. విశాఖపట్నం-గోపాల్పూర్ మధ్య తీరం దాటే సమయంలో గంటకు 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. ఇప్పటికే ఉత్తరాంధ్రలో కుండపోత వర్షాలు కురుస్తుండగా.. నేడు, రేపు అత్యంత భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. పలు జిల్లాల్లో ఆకస్మిక వరదలు సంభవించే అవకాశం ఉండటంతో రెడ్ అలర్ట్ జారీ చేసింది. కోస్తా జిల్లాల్లోనూ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.