AP: కోస్తాంధ్ర జిల్లాలకు IMD హైఅలర్ట్ ప్రకటించింది. కోనసీమ మీదుగా కాకినాడ-నర్సాపురం మధ్య తీరం దాటే అవకాశం ఉందని పేర్కొంది. గంటకు 140 గరిష్ట వేగంతో ప్రచండ గాలులు వీస్తాయని హెచ్చరించింది. తుఫాన్ తీవ్రతతో కుంభవృష్టి వర్షాలు పడతాయని, 20 సెం.మీటర్లకు పైగా వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని వెల్లడించింది.