ఏపీలో మున్సిపల్ ఎన్నికల నామినేషన్ గడువును పొడిగించాలంటూ YCP దాఖలు చేసిన హౌస్మోషన్ పిటిషన్ను ఏపీ హైకోర్టు తిరస్కరించింది. ఎన్నికల ప్రక్రియ మొదలైన తర్వాత జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది. ఈ మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల గడువు ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు ముగిసింది. తమ అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయలేదని YCP నేతలు ఆరోపిస్తున్నారు. అయితే, కోర్టు జోక్యం చేసుకోకపోవడంతో ఎన్నికల ప్రక్రియ యథాతథంగా కొనసాగుతుందని న్యాయ నిపుణులు చెబుతున్నారు.