AP: చంద్రబాబు నాయుడుపై నమోదైన స్కిల్ డెవలప్మెంట్ సహా ఏడు కేసుల వ్యవహారంలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసులను ఎందుకు మూసివేశారో వివరణ ఇవ్వాలని సీఐడీని కోర్టు ప్రశ్నించింది. నిందితులపై ఉన్న కేసులను సీబీఐకి బదిలీ చేయాలని దాఖలైన పిటిషన్ల విచారణలో భాగంగా, ఎఫ్ఐఆర్ నుంచి ప్రొటెస్ట్ పిటిషన్ల వరకు పూర్తి వివరాలతో కూడిన సమగ్ర పట్టికను సమర్పించాలని ఆదేశించింది. క్లోజర్ రిపోర్టులపై ప్రొటెస్ట్ పిటిషన్లను పరిశీలించే అధికారం కోర్టుకు ఉందని చీఫ్ జస్టిస్ ధర్మాసనం స్పష్టం చేసింది.