
కలినిన్గ్రాడ్పై దాడి చేస్తే ఊరుకోం.. పుతిన్ హెచ్చరిక
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ నాటో దేశాలకు తీవ్రస్థాయిలో హెచ్చరికలు జారీ చేశారు. రష్యా భూభాగమైన కలినిన్గ్రాడ్పై ప్రత్యక్ష దాడులు జరిగితే అణ్వాయుధాలను ప్రయోగించేందుకు కూడా వెనుకాడబోమని, తమ దేశ భద్రతకు ముప్పు వాటిల్లితే అందుబాటులో ఉన్న అన్ని రకాల విధ్వంసక ఆయుధాలను తక్షణమే ఉపయోగిస్తామని స్పష్టం చేశారు. పోలండ్, లిథువేనియా దేశాల మధ్య ఉన్న కలినిన్గ్రాడ్ ప్రాంతం రష్యాకు అత్యంత వ్యూహాత్మకమైనదని, నాటో బలగాలు దిగ్బంధించినా లేదా దాడులకు దిగినా అణు యుద్ధం అనివార్యమవుతుందని హెచ్చరించారు.




