1.25 లక్షల మందికి ఇళ్ల స్థలాలు

19చూసినవారు
1.25 లక్షల మందికి ఇళ్ల స్థలాలు
AP: పేదలకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్రంలో ఇంటి స్థలం లేని పేదలకు పట్టాలిచ్చేందుకు రెవెన్యూ శాఖ కార్యాచరణ సిద్ధం చేసింది. ఇప్పటివరకు వచ్చిన దరఖాస్తుల్ని రెవెన్యూ శాఖ విచారించింది. 1,24,873 మందికి కొత్తగా స్థలాలివ్వాలని గుర్తించింది. కూటమి ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు గ్రామాల్లో 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్ల చొప్పున పేదలకు స్థలాలు ఇవ్వాలంటే 4,800 ఎకరాలు సేకరించాలని తేల్చింది. భూసేకరణకు రూ.1,800 కోట్లు అవసరం అవుతుందని అంచనా.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్