AP: కాకినాడ జిల్లా, యానాంలో గంటకు 100 కి.మీ.కు పైగా వేగంతో వీస్తున్న బలమైన గాలుల కారణంగా భారీ మర్రిచెట్టు విరిగి ఇళ్లపై పడింది. ఈ ఘటనలో పలు ఇళ్లు దెబ్బతిన్నాయి. అయితే, ప్రజలను ముందే సురక్షిత ప్రాంతాలకు తరలించడం వల్ల ప్రాణనష్టం తప్పిందని ఎన్డీఆర్ఎఫ్ కమాండర్ ఈశ్వర్ రావు తెలిపారు. ప్రస్తుతం 30 మంది ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది సంఘటనా స్థలంలో సహాయక చర్యల్లో నిమగ్నమై ఉన్నారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ, బాధితులకు అవసరమైన సహాయాన్ని అందిస్తున్నామని అధికారులు పేర్కొన్నారు.