వైసీపీ విరాళాల్లో భారీ క్షీణత: 82% పతనం

860చూసినవారు
వైసీపీ విరాళాల్లో భారీ క్షీణత: 82% పతనం
రాజకీయ పార్టీలకు విరాళాలు రావడం చట్టబద్ధమైన ప్రక్రియ. 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి వైసీపీకి అందిన విరాళాలు 24.31 కోట్ల రూపాయలకు పడిపోయాయి. అంతకుముందు ఏడాది 140.04 కోట్ల రూపాయలు రాగా, ఈ ఏడాది 82% క్షీణత నమోదైంది. అధికారంలో ఉన్న టీడీపీకి కూడా విరాళాలు 30% తగ్గాయి. ఎన్నికలు లేకపోవడం, రాజకీయ వేడి తగ్గడమే దీనికి కారణమని విశ్లేషకులు భావిస్తున్నారు. 2028 నాటికి ఎన్నికల వేడి పెరిగితే విరాళాలు పెరిగే అవకాశం ఉంది.

సంబంధిత పోస్ట్