AP: అమలాపురంలోని మహిపాల వీధిలో ఆదివారం తెల్లవారుజామున ఒక ఇంట్లో భారీ పేలుడు సంభవించింది. ఈ పేలుడు ధాటికి ఇల్లు పూర్తిగా ధ్వంసమైంది. ఈ పేలుడు ధాటికి చుట్టుపక్కల భవనాలు అదిరిపోయాయి. ప్రమాదంలో ఇంట్లో ఉన్న ఒకరికి స్వల్ప గాయాలయ్యాయి. స్థానిక ఎమ్మెల్యే ఆనందరావు, డీఎస్పీ ప్రసాద్ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. పేలుడుకు గల అసలు కారణాలపై అధికారులు దర్యాప్తు జరుపుతున్నారు.