AP: రాష్ట్రాన్ని విద్యా కేంద్రంగా తీర్చిదిద్దే లక్ష్యంతో ఏపీ ప్రభుత్వం విదేశీ విద్యాసంస్థలు, ఇతర రాష్ట్రాల ప్రైవేట్ విశ్వవిద్యాలయాలను ఆహ్వానిస్తోంది. డిసెంబర్ 2027లోగా ఒప్పందం చేసుకునే సంస్థలకు 50 ఎకరాల వరకు భూమి, స్టాంప్ డ్యూటీ మినహాయింపు వంటి ప్రోత్సాహకాలను అందించే కొత్త విధానాన్ని ప్రభుత్వం విడుదల చేసింది. 2029 నాటికి కనీసం 5 విదేశీ సంస్థలను, 5000 మందికి పైగా విదేశీ విద్యార్థులను రాష్ట్రానికి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకుంది.