AP: రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఏకగ్రీవంగా ఎన్నికైన పంచాయతీలకు రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సాహకాలను పెంచింది. 5 వేల వరకు జనాభా కలిగిన పంచాయతీలు ఏకగ్రీవంగా ఎన్నికైతే రూ.15 లక్షల ప్రోత్సాహకాన్ని అందించనుంది. 5 వేల నుంచి 10 వేల మధ్య జనాభా ఉన్న పంచాయతీలకు రూ.25 లక్షలు, 10 వేల కంటే ఎక్కువ జనాభా కలిగిన పంచాయతీలు ఏకగ్రీవంగా ఎన్నికైతే రూ. 50 లక్షల ప్రోత్సాహకాన్ని అందించనుంది.