AP: డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మలికిపురం మండలం గొల్లపాలెం సముద్ర తీరానికి భారీ రబ్బర్ ఫెండర్ కొట్టుకువచ్చింది. సముద్ర అలల ఉధృతికి ఈ భారీ పరికరం తీరానికి చేరడంతో స్థానికులు పెద్ద ఎత్తున అక్కడికి తరలివచ్చారు. పోర్టులలో నౌకల రక్షణ కోసం ఉపయోగించే ఈ రబ్బర్ ఫెండర్, సముద్ర తీరంలో కనిపించడంతో స్థానికులు ఆశ్చర్యానికి గురయ్యారు. సాధారణంగా ఇక్కడ ఇలాంటి పరికరాలు కనిపించవు కాబట్టి, దీన్ని చూడటానికి జనం క్యూ కట్టారు.