AP: అనకాపల్లి జిల్లా బుచ్చెయ్యపాలెం మండలానికి చెందిన
టీడీపీ నేత గేదెల సత్యనారాయణ దంపతులను అదృష్టం వరించింది. పొట్టిదొరపాలెం ఎంపీటీసీ సభ్యుడిగా గేదెల సత్యనారాయణ గెలిచారు. దాంతో ఆయనను ఎంపీపీగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్‌గా ఆయన భార్య గేదెల సత్యవతి కూడా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వీరిద్దరినీ కూటమి నేతలు సన్మానించారు.