నాపై దాడి జరిగింది: ఎంపీ అవినాష్ రెడ్డి

44చూసినవారు
నాపై దాడి జరిగింది: ఎంపీ అవినాష్ రెడ్డి
AP: నామినేషన్ వేసేందుకు వెళ్తున్న సమయంలో తనపై దాడి జరిగిందని అవినాష్ రెడ్డి ఆరోపించారు. కేవలం ఐదు వాహనాలతో వెళ్లిన తనపై బీటెక్ రవి ఆధ్వర్యంలో పెట్రోల్ బాంబులతో దాడి చేశారని ఆయన పేర్కొన్నారు. పోలీసుల సమక్షంలోనే ఈ దాడులు జరిగాయని, తమను అడ్డుకోవడమే కాకుండా బాధితులపైనే కేసులు నమోదు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. రాష్ట్రంలో ఎన్నికల సంఘం, శాంతి భద్రతలు ఉన్నాయా అని ప్రశ్నించిన ఆయన, హైకోర్టు ఆదేశాలను కూడా పోలీసులు పట్టించుకోవడం లేదని తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్