AP: మాజీ మంత్రి అంబటి రాంబాబు షాకింగ్ కామెంట్స్ చేశారు. రెండేళ్ల క్రితం తమ పార్టీకి అధికారం పోయిందని, అది లేనప్పుడే నిజమైన కార్యకర్త ధైర్యం బయటపడుతుందని అంబటి రాంబాబు అన్నారు. రాబోయే ఎన్నికల నేపథ్యంలో గుంటూరు
వైసీపీ నేతలు, కార్యకర్తలతో ఆయన భేటీ అయ్యారు. ఎన్నికలపై ఈ సందర్భంగా ఆయన దిశానిర్దేశం చేశారు. భయపడకుండా రాబోయే స్థానిక సంస్థలు, గుంటూరు కార్పొరేషన్ ఎన్నికలకు సిద్ధం కావాలని తెలిపారు. ఎంతటి ధన బలం, అధికార బలాన్ని అయినా ఎదుర్కొని పోరాడతామని ఆయన ధీమా వ్యక్తం చేశారు.