ఏపీ రాజధాని అమరావతికి అంతర్జాతీయంగా ప్రాధాన్యం మరింత పెరగనుంది. అమరావతి కేంద్రంగా 'ఫారెనర్స్ రీజినల్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ (FRRO)' కార్యాలయాన్ని ఏర్పాటు చేస్తూ కేంద్ర హోం మంత్రిత్వ శాఖ అధికారికంగా గెజిట్
నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ కార్యాలయం అందుబాటులోకి రావడం వల్ల విదేశీయుల ఇమ్మిగ్రేషన్,
వీసా పొడిగింపు, రిజిస్ట్రేషన్ల సేవలు వేగవంతం కానున్నాయి. రాజధాని అభివృద్ధికి, అంతర్జాతీయ పెట్టుబడులు, విదేశీ ప్రయాణాల సులభతర నిర్వహణకు ఈ నిర్ణయం ఎంతగానో తోడ్పడనుంది.