ప్రకాశం జిల్లాపై మురసు తుఫాన్ ప్రభావం

41చూసినవారు
ప్రకాశం జిల్లాపై మురసు తుఫాన్ ప్రభావం
AP: ప్రకాశం జిల్లాలో మురసు తుఫాన్ ప్రభావం తీవ్రంగా ఉంది. గంటకు 100 కి.మీ.కు పైగా వేగంతో వీస్తున్న ఈదురుగాలుల ధాటికి కొత్తపట్నం, టంగుటూరుతో సహా 6 మండలాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఒంగోలులో కూడా బలమైన గాలుల వల్ల చెట్లు నేలకొరగడం, విద్యుత్ స్తంభాలు విరిగిపడటం వంటి నష్టాలు జరిగాయి. దీనివల్ల పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. పరిస్థితి తీవ్రతను దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్