AP: రాయచోటిలో పోలీసులు అంతర్రాష్ట్ర రౌడీ ముఠాను పట్టుకున్నారని
టీడీపీ పేర్కొంది. మారణాయుధాలతో సహా నేరగాళ్లను అదుపులోకి తీసుకున్నారని వెల్లడించింది. నిందితుల నుంచి పోలీసులు రెండు పిస్టళ్లు, బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నారని, అక్రమ ఆయుధాలు కలిగి ఉన్న 10 మంది అంతర్రాష్ట్ర ముఠా సభ్యులను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు పేర్కొంది. రాయచోటి ఎన్నికల్లో అల్లర్లకు
వైసీపీ కుట్రలు చేస్తోందని
టీడీపీ ఆరోపించింది.