AP: అనకాపల్లి జిల్లాకు రూ.1,750 కోట్ల భారీ పెట్టుబడి వచ్చే అవకాశం ఉంది. అచ్యుతాపురంలో సెయింట్ గోబెన్ ఫ్లోట్ గ్లాస్ తయారీ ప్లాంట్ ఏర్పాటు కానుంది. 400 మందికి సెయింట్ గోబెన్ ఫ్లోట్ గ్లాస్ సంస్థ ఉపాధి కల్పించనుంది. విశాఖ భాగస్వామ్య సదస్సులో సీఎం చంద్రబాబుతో సెయింట్ గోబెన్ సీఈవో శ్రీధర్ భేటీ అయ్యారు. ఏపీలో ఇప్పటికే తడ, విశాఖ, కావలిలో సెయింట్ గోబెన్ తయారీ యూనిట్లు ఉన్నాయి. ప్లాస్టర్ బోర్డ్, జిప్సమ్ సిస్టమ్స్, ఇన్సులేషన్ రంగాల్లోనూ పెట్టుబడికి ప్రణాళిక రూపొందిస్తోంది.