AP: లిక్కర్, భూ పట్టాల కుంభకోణాలపై దర్యాప్తు బృందాలు లోతుగా విచారణ జరుపుతున్నాయి. ఈ క్రమంలోనే మంత్రి అంబటి రాంబాబుకు నోటీసులు అందాయి. ఆయన విచారణ ఖాయమని, అరెస్ట్ కూడా జరగవచ్చని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. లిక్కర్ స్కామ్లో
జగన్ మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడైన ఒక వ్యక్తిని ఇటీవల ఈడీ అధికారులు విచారించినట్లు సమాచారం. ఈ వివరాల ఆధారంగా
జగన్ అరెస్ట్ కూడా ఖాయమని విశ్లేషకులు భావిస్తున్నారు. నిబంధనలను మార్చి, అడ్డగోలుగా వ్యవహరించి, ఊరు పేరు లేని కంపెనీలకు లైసెన్సులు ఇచ్చారని ఆరోపణలున్నాయి. అయితే,
జగన్ అరెస్ట్ అయితే ప్రజల సానుభూతి పొంది, పాదయాత్ర ద్వారా అధికార కూటమికి ఇబ్బంది కలిగించవచ్చని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.