గ్రామాల్లో వైసీపీని ఖాళీ చేస్తున్న జనసేన?

22చూసినవారు
గ్రామాల్లో వైసీపీని ఖాళీ చేస్తున్న జనసేన?
AP: 2024 ఎన్నికల సమయంలో తాడేపల్లిగూడెంలో జరిగిన కూటమి సభలో పవన్ కళ్యాణ్ వైసీపీని పాతాళంలోకి తొక్కకపోతే తన పేరు పవన్ కళ్యాణ్ కాదని, తన పార్టీ జనసేన కాదని సవాల్ విసిరారు. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ మాస్టర్ ప్లాన్ వేశారు. ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల కోసం గ్రామాల్లో వైసీపీని ఖాళీ చేసే వ్యూహాన్ని పవన్ రచించారు. ఇప్పటికే వేలాది మంది వైసీపీ క్యాడర్ జనసేనలో చేరుతున్నారు. ఇది జరిగితే జగన్‌కు ఇది చావుదెబ్బ అవుతుంది. ఇక అలాగే విజయనగరం జిల్లాలో వైసీపీ పరిస్థితి కుప్పకూలింది, క్యాడర్ టీడీపీలో చేరింది. బొత్స సత్యనారాయణ జనసేనలో చేరే అవకాశాలున్నాయని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. టీడీపీ, జనసేన అన్ని జిల్లాల్లోనూ ఇలాంటి ఆపరేషన్లు నిర్వహిస్తున్నాయి.

సంబంధిత పోస్ట్