AP: త్వరలోనే రాష్ట్రంలో స్థానిక
ఎన్నికలు జరగనున్నాయి. 2024 ఎన్నికల్లో ఎదురైన పరాభవానికి ప్రతీకారం తీర్చుకోవాలని,
టీడీపీ కూటమికి గట్టి సవాల్ విసరాలని
వైసీపీ భావిస్తోంది. అయితే, కొంతమంది నేతల వ్యవహార శైలి, ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లాలో నేతల అక్రమాలు, భూకబ్జాలు వంటి ఆరోపణలు పార్టీకి నష్టం కలిగిస్తున్నాయని తెలుస్తోంది. స్పీకర్ గా పనిచేసిన తమ్మినేని సీతారాం కూడా ఇలాంటి ఆరోపణలను ఎదుర్కొంటున్నారు. అధిష్టానం నుంచి సరైన మద్దతు లభించకపోవడంతో ఆయన పార్టీకి దూరమవుతున్నారని వార్తలు వస్తున్నాయి.