AP: నెల్లూరు డిప్యూటీ మేయర్ ఎంపికపై సింహపురి రాజకీయాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఈ నెల 23న మేయర్గా రూప్ కుమార్ యాదవ్ ప్రమాణస్వీకారం చేయనున్నారు. అయితే డిప్యూటీ మేయర్ పదవిని రూరల్ నియోజకవర్గానికి కేటాయిస్తారని ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డితో మంత్రి ఆనం భేటీ అయ్యారు. డిప్యూటీ మేయర్గా ఆనం రంగమయూర్ పేరును పరిశీలించాలని కోటంరెడ్డిని మంత్రి కోరినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.