బొత్స, తమ్మినేనిలకు టిక్కెట్లు ఖరారు చేసిన జగన్!

109చూసినవారు
బొత్స, తమ్మినేనిలకు టిక్కెట్లు ఖరారు చేసిన జగన్!
AP: ఉత్తరాంధ్రలో వైసీపీ సీనియర్‌ నేతల పరిస్థితిపై చర్చ జరుగుతున్న వేళ.. బెంగళూరు నుంచి వచ్చిన జగన్‌ బుధవారం బొత్స సత్యనారాయణ, తమ్మినేని సీతారాంలతో సమావేశమైనట్లు సమాచారం. తమ్మినేని సీతారాం కుమారుడి వ్యాఖ్యలపై జగన్‌ చర్చించినట్లు తెలుస్తోంది. అనంతరం శ్రీకాకుళం ఎంపీ టికెట్‌ తమ్మినేని సీతారాంకే ఇస్తానని హామీ ఇచ్చినట్లు సమాచారం. బొత్సకు చీపురుపల్లి టికెట్‌ విషయంలోనూ స్పష్టత ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే ఈ భేటీపై ఇద్దరు నేతలు బయట ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు.

సంబంధిత పోస్ట్