AP:
వైసీపీ హయాంలో జగనన్న కాలనీల పేరుతో పేదలను మోసం చేశారని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ఆరోపించారు. బుర్రిపాలెం సభలో ఆయన మాట్లాడుతూ.. '
జగన్ అధికారంలోకి వచ్చాక 3 లక్షల టిడ్కో ఇళ్లను నిర్మించకుండా వదిలేశారు. జగనన్న కాలనీల పేరిట ఊరి బయట, పనికిరాని స్థలాల్లో 2 లక్షల ఇళ్లకు డబ్బు మళ్లించారు. వాటిని కూడా పూర్తి చేయలేదు. కేవలం 30వేల ఇళ్లు పూర్తిచేశారు. రాజకీయ లబ్ధి కోసం లక్షల కుటుంబాలకు అన్యాయం చేశారు' అని విమర్శించారు.