ఏపీలో గెలుపు కోసం జగన్ పెద్ద ప్లాన్!

61చూసినవారు
ఏపీలో గెలుపు కోసం జగన్ పెద్ద ప్లాన్!
AP: 2024 ఎన్నికల్లో YCP ఘోర పరాజయం తర్వాత, పార్టీని బలోపేతం చేయడానికి జగన్ పాదయాత్ర చేయాలని భావించారు. అయితే, ఇటీవల నిర్వహించిన అంతర్గత సర్వేలో ప్రతికూల ఫలితాలు రావడంతో, కూటమి ప్రభుత్వం బలంగా ఉన్న నేపథ్యంలో పాదయాత్ర పెద్దగా ప్రయోజనం చేకూర్చదని భావించి, జగన్ తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నట్లు సమాచారం. ఎన్నికలకు ఏడాది ముందు పాదయాత్ర చేసే ప్రణాళికలు రూపొందించుకుంటారని, అప్పటివరకు పార్టీ బలోపేతంపై దృష్టి సారిస్తారని నాయకులు అంటున్నారు. ఒకవేళ జగన్ పాదయాత్ర చేస్తే, టీడీపీ నుంచి లోకేష్ కూడా పాదయాత్ర చేసే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి.

సంబంధిత పోస్ట్