జగన్ నిర్ణయం.. కాంగ్రెస్‌ను పక్కన పెట్టారా?

133చూసినవారు
జగన్ నిర్ణయం.. కాంగ్రెస్‌ను పక్కన పెట్టారా?
AP: వైసీపీ అధినేత జగన్ జాతీయ రాజకీయాలపై తన వైఖరిని స్పష్టం చేశారు. కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమిలో చేరే ప్రసక్తే లేదని సంకేతాలిచ్చారు. డీలిమిటేషన్ బిల్లుకు మద్దతు ఇస్తూనే దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరగకూడదని, మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించాలని తన డిమాండ్‌ను వెల్లడించారు. కాగా, ఇటీవల జగన్ కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకోబోతున్నారని, అందుకే బీజేపీకి దూరం ఉంచినట్లు ప్రచారం జరిగింది. తాజాగా డీలిమిటేషన్, రిజర్వేషన్ అంశంపై బీజేపీకి మద్దతు ఇవ్వడంతో జగన్ కాంగ్రెస్‌ను పక్కన పెట్టారని ప్రచారం జరుగుతోంది.

సంబంధిత పోస్ట్