AP: మాజీ సీఎం జగన్ పులివెందుల పర్యటనపై
టీడీపీ నేత పట్టాభి విమర్శలు చేశారు. మధ్యాహ్నం 12.50 గంటలకు పులివెందుల వచ్చేందుకు పోలీసుల అనుమతి తీసుకున్న జగన్.. ఉదయం 10 గంటలకే ఎందుకు వచ్చారని ప్రశ్నించారు. అక్కడ అరాచకం సృష్టించేందుకే ఆయన వచ్చారని ఆరోపించారు. ప్రజాస్వామ్యబద్ధంగా పోలింగ్ జరుగుతుండటంతో వెనుదిరిగి వెళ్లిపోయారని వ్యాఖ్యానించారు.
వైసీపీ అభ్యర్థులకు అసలు ఎందుకు ఓటు వేయాలని పట్టాభి ప్రశ్నించారు.