AP: కాకినాడ జిల్లా పిఠాపురంలో మున్సిపల్ వైస్ ఛైర్మన్ ఎన్నిక ఉద్రిక్తతల మధ్య సాగింది.
జనసేన కౌన్సిలర్ల మధ్య భిన్నాభిప్రాయాలు రావడంతో కొంత గందరగోళం నెలకొంది. పార్టీ నిర్ణయించిన బొజ్జ వెంకటేశ్వర రావు అభ్యర్థిత్వాన్ని కొందరు వ్యతిరేకించారు. చివరకు ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు రంగంలోకి దిగి కౌన్సిలర్లను బుజ్జగించడంతో వివాదం సద్దుమణిగింది. దీనితో బొజ్జ వెంకటేశ్వర రావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆఫీస్ వెలుపల కొంత ఉద్రిక్తత చోటుచేసుకున్నా, పోలీసులు, పార్టీ నాయకుల జోక్యంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది.