AP: తూర్పు గోదావరి జిల్లా నిడదవోలు మున్సిపల్ వైస్ ఛైర్మన్ ఎన్నికలో ఊహించని రాజకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఎన్నికల సభలో అధికార పార్టీకి చెందిన ఇద్దరు కౌన్సిలర్లు చెట్టె రాజకుమారి, విప్పర్తి శిరీష
జనసేన అభ్యర్థి కళ్యాణ్ చక్రవర్తికి మద్దతు ప్రకటించి చేతులు ఎత్తారు. సొంత పార్టీ సభ్యులే ప్రత్యర్థికి మద్దతు తెలపడం స్థానిక రాజకీయాల్లో పెద్ద చర్చకు దారితీసింది. ఈ అనూహ్య మలుపుతో నిడదవోలు రాజకీయాల్లో గందరగోళం నెలకొంది.