AP: స్థానిక సంస్థల ఎన్నికలపై
జనసేన భారీ స్కెచ్ వేస్తున్నట్లు తెలుస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో సీట్ల షేరింగ్పై
జనసేన ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు సమాచారం. 5-6 మేయర్ పోస్టులు, 9 వరకు జడ్పీ ఛైర్పర్సన్ పోస్టులు, సుమారు 25 మున్సిపల్ ఛైర్పర్సన్ స్థానాలు ఇవ్వాలని డిమాండ్ చేయనున్నట్లు తెలుస్తోంది. MPTC, ZPTCల్లో 30% సీట్లపై
జనసేన కన్నేసింది. ఏలూరు, కాకినాడ, విజయవాడ, ఒంగోలు, తిరుపతి వంటి కీలక నగరాల్లో పోటీకి
జనసేన ఆసక్తి చూపుతున్నట్లు సమాచారం.