సీఎం చంద్రబాబుతో జపాన్ రాయబారి భేటీ (వీడియో)

10చూసినవారు
AP: సీఎం చంద్రబాబుతో జపాన్ రాయబారి కెయిచీ ఓనో బుధవారం విశాఖలో భేటీ అయ్యారు. పారిశ్రామిక పెట్టుబడులు, నైపుణ్యాభివృద్ధి, మౌలిక వసతులపై ఇరువురు చర్చించారు. రాష్ట్రంలో పెట్టుబడులకు జపాన్ కంపెనీలు ఆసక్తి చూపుతున్నాయని చంద్రబాబు వెల్లడించారు. పరిశ్రమలకు అనుమతులు, పారదర్శక రాయితీలు ఇస్తున్నామన్నారు. జపాన్ కంపెనీలు కోరినట్లు యువతకు శిక్షణ ఇవ్వాలని సీఎం విజ్ఞప్తి చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్