నేడు APSRTC జేఏసీ నేతలతో జేఎండీ సమావేశం

47చూసినవారు
నేడు APSRTC జేఏసీ నేతలతో జేఎండీ సమావేశం
AP: APSRTC జేఏసీ నేతలతో శుక్రవారం జేఎండీ సమావేశం కానుంది. మధ్యాహ్నం 3 గంటలకు విజయవాడలోని ఆర్టీసీ హౌస్‌లో ఈ సమావేశం జరగనుంది. ఆర్టీసీ జేఏసీ ఇచ్చిన నోటీసుపై ఈ భేటీలో ఆర్టీసీ యాజమాన్యం చర్చించనుంది. ముఖ్యంగా ఆర్టీసీ సంస్థను పరిరక్షించడం మరియు ఉద్యోగులు ఎదుర్కొంటున్న పలు సమస్యల పరిష్కారంపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చలు జరిపే అవకాశం ఉంది. ఈ సమావేశంపై ఆర్టీసీ వర్గాల్లో ప్రాధాన్యత సంతరించుకుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్