AP: శ్రీకాకుళం నందిగాం మండలం ఉయ్యాలపేట గ్రామానికి చెందిన 15 కుటుంబాలు సోమవారం టీడీపీలో చేరాయి. నిమ్మాడ క్యాంపు కార్యాలయంలో మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు సమక్షంలో వీరు పార్టీ కండువాలు కప్పుకున్నారు. గేదెల అప్పన్న, మల్లేసు, కప్ప కామేశ్వరరావు, గిన్ని లక్ష్మీనారాయణ సహా పలువురు పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో కింజరాపు హరివరప్రసాద్ పాల్గొన్నారు. ఇదే సమయంలో మంత్రి అచ్చెన్నాయుడు జిల్లా ప్రజలకు, రైతులకు విజయదశమి పండుగ శుభాకాంక్షలు తెలిపారు.