విశాఖలో వైసీపీ నుంచి టీడీపీలోకి చేరికలు

17చూసినవారు
విశాఖలో వైసీపీ నుంచి టీడీపీలోకి చేరికలు
AP: విశాఖపట్నంలో రాజకీయ వలసల పర్వం కొనసాగుతోంది. తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ బాబు కార్యాలయం వద్ద 24, 25 వార్డుల నుండి సుమారు 200 మంది టీడీపీలో చేరారు. విశాఖ ఎన్నికల పరిశీలకులు ఫరూక్, ఎమ్మెల్యే రామకృష్ణ బాబు, విశాఖ పార్లమెంట్ విభాగం అధ్యక్షుడు పట్టాభి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. విశాఖలో జరిగిన అభివృద్ధి, కూటమి ప్రభుత్వం చేసిన సంక్షేమమే తమ అభ్యర్థుల గెలుపునకు దోహదపడతాయని అతిథులు తెలిపారు. మేయర్ టికెట్ ఎవరికిచ్చినా అభ్యర్థి గెలుపు కోసం సమిష్టిగా కృషి చేస్తామని వారు పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్