
బలపడుతున్న అల్పపీడనం.. అతిభారీ వర్షాలు
AP: బంగాళాఖాతంలో అల్పపీడనం బలపడుతోంది. ఎల్లుండి తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉంది. దక్షిణ ఒడిశా-ఉత్తరాంధ్ర తీరం వైపు అల్పపీడనం దూసుకొస్తోంది. అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రంలో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. తీరం వెంబడి 50-60 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీచే ఛాన్సుంది. ఈ మేరకు అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో హోంమంత్రి అనిత సోమవారం టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. సహాయక చర్యల కోసం NDRF, SDRF బృందాలను సిద్ధం చేయాలని ఆదేశించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సూచించారు.































